News February 16, 2025

సూర్యాపేట: ఈ సండే.. చికెన్‌కు దూరమేనా?

image

ఆదివారం వచ్చిందంటే ఇండ్లల్లో నాన్-వెజ్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇక ఉమ్మడి NLG జిల్లాలో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కడతారు. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజి బిజీగా ఉండే జిల్లా వాసులు సండే ఓ ముక్క అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులు ఈ ఆదివారం చికెన్‌కు దూరంగా ఉంటున్నారు.

Similar News

News November 7, 2025

కాగజ్‌నగర్: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

image

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్‌లు ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

News November 7, 2025

కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

image

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.

News November 7, 2025

నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.