News February 16, 2025

సూర్యాపేట: ఈ సండే.. చికెన్‌కు దూరమేనా?

image

ఆదివారం వచ్చిందంటే ఇండ్లల్లో నాన్-వెజ్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇక ఉమ్మడి NLG జిల్లాలో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కడతారు. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజి బిజీగా ఉండే జిల్లా వాసులు సండే ఓ ముక్క అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులు ఈ ఆదివారం చికెన్‌కు దూరంగా ఉంటున్నారు.

Similar News

News March 20, 2025

నాగర్ కర్నూల్: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డుపై అవగాహన సదస్సు

image

యూడీఐడీ కార్డుపైగా అవగాహన సదస్సును ఈరోజు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నిరంజన్, గణేశ్ కుమార్, బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.

News March 20, 2025

బాపట్ల: కలెక్టర్‌ను కలిసిన R&B ఈఈ

image

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్‌కు మొక్కను అందజేశారు.

News March 20, 2025

ప్యాపిలి: స్కూల్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు

image

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు చెప్పారు.

error: Content is protected !!