News March 3, 2025

సూర్యాపేట: ఉపకార వేతన కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి లత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 4, 2025

75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్

image

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.

News March 4, 2025

SLBC టన్నెల్లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరిక

image

SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్ల ఊట నీరు ఉబికి రావడంతో భారీగా బురద పేరుకుపోయింది. ఈ పరిస్థితి మృతదేహాల వెలికితీత మరింత కష్టతరం చేస్తోంది. నీటి ప్రవాహం నియంత్రించలేకపోతే మరో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

News March 4, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు: సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు, మైకుల వినియోగం నిషేధించామని తెలిపారు. పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.

error: Content is protected !!