News March 30, 2024

సూర్యాపేట: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

image

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Similar News

News November 26, 2025

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

image

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.

News November 26, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

image

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి

News November 26, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఉదయాదీత్య భవన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.