News March 9, 2025

సూర్యాపేట: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News December 4, 2025

HNK: కోతులు, కుక్కల బెడదపై ప్రత్యేక ఫోకస్..

image

హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదను అరికడితేనే మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్తూ ఉండడంతో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నేరెళ్ల గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణలతో విన్నూత్న ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

image

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.

News December 4, 2025

గద్వాల్: రాజవంశీయురాలు డా.సుహాసినిరెడ్డి మృతి

image

గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లాకు చెందిన రాజవంశీయురాలు డాక్టర్ సుహాసినిరెడ్డి (85) గురువారం తెల్లవారుజామున నిద్రలో మరణించినట్లు ఆమె కుమారుడు లక్ష్మీ చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆమె మరణం పట్ల జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.