News February 11, 2025
సూర్యాపేట: ఓటర్ జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. 23 జడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో సోమవారం నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం మొత్తం 6,96,329 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,41,560 మంది, మహిళలు 3,54,748 మంది, ఇతరులు 55 మంది ఉన్నారు.
Similar News
News December 9, 2025
పాకిస్థాన్కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్ను తప్పించుకుంది.
News December 9, 2025
ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<


