News February 11, 2025

సూర్యాపేట: ఓటర్ జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. 23 జడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లో సోమవారం నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం మొత్తం 6,96,329 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,41,560 మంది, మహిళలు 3,54,748 మంది, ఇతరులు 55 మంది ఉన్నారు.

Similar News

News March 18, 2025

తిరుగు ప్రయాణం మొదలు

image

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.

News March 18, 2025

VKB: రంజాన్ షాపింగ్‌కి వెళ్లొచ్చేసరికి చోరీ

image

షాపింగ్‌కు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన ఘటన వికారాబాద్ జిల్లా చెన్గోముల్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పర్వీన్ బేగం, ఆమె భర్త మోరుఫ్ అలీ రంజాన్ పండుగ షాపింగ్ కు వికారాబాద్ వెళ్లారు. షాపింగ్ చేసుకొని తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలకొట్టి దొంగతనం చేశారు. అరతులం గొలుసు, 20 తులాల వెండి, నగదు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News March 18, 2025

ఎన్టీఆర్: భూ కేటాయింపులపై క్యాబినెట్ భేటీలో ఆమోదం

image

అమరావతిలో భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సోమవారం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గతంలో జరిగిన 31 కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ మరో 38 కేటాయింపులకు సవరణలు చేస్తూ ఉపసంఘం సూచనలు చేసింది. 14 కేటాయింపుల రద్దు, 6 కొత్త సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ సిఫార్సులు చేయగా..వాటన్నింటిని క్యాబినెట్ ఆమోదించింది.

error: Content is protected !!