News March 17, 2025
‘సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వంట వార్పు’

తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు 48గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ, సీటు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.
News March 18, 2025
కొండగట్టులో గుర్తుతెలియని కుళ్ళిన మృత దేహం

గుర్తుతెలియని కుళ్ళిన మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు దిగువ ప్రాంతంలోని తుమ్మచెరువు ప్రాంతంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం మృతి చెందడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
News March 18, 2025
భార్య, అత్త వేధింపులు.. భర్త ఆత్మహత్య

TG: భార్యల వేధింపులతో తనువు చాలిస్తున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా HYDలో అబ్దుల్ జమీర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అతను స్నేహితులతో చెప్పుకునేవాడని సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్న రోజు ఇంట్లో వారిద్దరూ ఉన్నారని, అతను చనిపోయాక అనంతపురానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం ఈ ఘటన జరగగా సోమవారం చెడువాసన రావడంతో విషయం బయటికొచ్చింది.