News April 12, 2024

సూర్యాపేట: కానిస్టేబుల్ సస్పెండ్

image

ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళిని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా SP రాహుల్ హెగ్డే హెచ్చరించారు. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో MCC కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం. నేరేడుచర్లకి చెందిన అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పాలకీడు కానిస్టేబుల్ చింతలచెరువు విష్ణు‌‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News March 23, 2025

NLG: మహిళా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

మహిళా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను మహిళా రైతులకు రాయితీపై అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు కోటి 81 లక్షల 36 వేల నిధులను కేటాయించడంతో పాటు 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే మహిళల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.

News March 23, 2025

NLG: సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్ని కల్, ట్రేడ్స్ మెన్‌గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు.

News March 23, 2025

NLG: ఇంటిగ్రేటెడ్ IPC కోర్స్‌తో ఉజ్వల భవిష్యత్తు: VC 

image

ఇంటిగ్రేటెడ్ ఐపీసీ కోర్స్‌తో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వైస్ ఛాన్స్‌లర్ అల్తాన్ హుసేన్ అన్నారు. రీసెర్చ్ అడ్వాన్స్ ఇన్ ఫార్మాటికల్ సెమినార్‌లో భాగంగా ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ IPC కోర్సుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సు పూర్తి చేసిన పూర్వ విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీల అధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

error: Content is protected !!