News February 4, 2025

సూర్యాపేట: కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

image

BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు వర్షిత్‌రెడ్డి నియామకంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Similar News

News October 17, 2025

చిత్త కార్తె.. వ్యవసాయ సామెతలు

image

✍️ చిత్త కురిస్తే చింతలు కాయును
✍️ చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును
✍️ చిత్తలో చల్లితే చిత్తుగా పండును
✍️ చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
* రబీ పంటలకు చిత్త కార్తెలో పడే వానలు చాలా కీలకం. అందుకే ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవారు.
* మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
<<-se>>#AgricultureProverbs<<>>

News October 17, 2025

వనపర్తి: మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్ బండ్‌పై సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సామగ్రిని, మొక్కలను సంరక్షించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లచెరువు ట్యాంక్ బండ్‌తో పాటు, ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా ఆర్చితోపాటు గేటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 17, 2025

ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

image

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.