News March 4, 2025
సూర్యాపేట: కోదండరామ్ మద్దతిచ్చిన వ్యక్తికి 24 ఓట్లు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరామ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
Similar News
News December 15, 2025
అన్నమయ్య జిల్లాలో సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.రోషన్‌ను రామాపురం నుంచి రాయచోటి రూరల్‌కు బదిలీ చేశారు. అక్కడ ఉన్న వరవరప్రసాద్ను వీఆర్‌కు పంపారు. సీసీఎస్‌లో పనిచేస్తున్న కృష్ణంరాజు నాయక్‌ను లక్కిరెడ్డిపల్లి సీఐగా నియమించారు. అక్కడ ఉన్న కొండారెడ్డిని RSASTFకు, RSASTF నుంచి చంద్రశేఖర్‌ను ఆదోనికి, మస్తాన్‌ను SC, ST సెల్‌కు బదిలీ చేశారు.
News December 15, 2025
ధనుర్మాసంలో ఆచరించాల్సిన పూజలు, వ్రతాలు

ధనుర్మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. అనేక రకాల వ్రతాలను ఆచరిస్తారు. అందులో గోదాదేవి కాత్యాయనీ వ్రతం ప్రధానమైనది. ఇందులో శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథులను పూజిస్తారు. అలాగే చాంద్రమానం ప్రకారం వచ్చే మార్గశీర్ష వ్రతం మనలో సత్వగుణాన్ని పెంచుతుంది. వీటితో పాటు శ్రీవ్రతం, సిరినోములను ఆచరిస్తారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ఇంట్లో సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.
News December 15, 2025
ఖమ్మం: చెల్లిపై 13 ఓట్లతో సర్పంచిగా గెలిచిన అక్క

నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ పదవి కోసం ఏకంగా అక్కాచెల్లెళ్లు పోటీ పడటం గ్రామంలో చర్చకు దారితీసింది. తోడల్లుళ్ల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే ఈ పోరుకు కారణమయ్యాయి. ఈ పోటీలో, అక్క మన్నెంపూడి కృష్ణకుమారి తన చెల్లెలు చిట్టూరి రంగమ్మపై కేవలం 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప తేడాతో చెల్లిపై అక్క గెలవడంతో ఆమె మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు.


