News October 15, 2024

సూర్యాపేట: ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి: పీఆర్టీయూ 

image

సూర్యాపేట జిల్లాలో అవసరం ఉన్న ప్రతి పాఠశాలకు డీఎస్సీ-2024 అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేశ్ కోరారు. మంగళవారం డీఎస్సీ 2024 సెలెక్టెడ్ అభ్యర్థుల కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా ఆయన డీఈవో అశోక్‌తో సమావేశమయ్యారు. అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా కౌన్సెలింగ్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

Similar News

News October 15, 2024

నల్గొండ: విద్యుత్ శాఖలో ముగిసిన బదిలీల ప్రక్రియ

image

నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మూడు డివిజన్ల పరిధిలో బదిలీల ప్రక్రియ ముగిసింది. 34 మంది లైన్ ఇన్‌స్పెక్టర్లు, 126 మంది లైన్మెన్లు, 30 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఇద్దరు జూనియర్ లైన్మెన్లు బదిలీ అయ్యారు. నల్గొండ డీఈ (ఆపరేషన్) అన్నమయ్య పదోన్నతి పై హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భువనగిరికి బదిలీ అయ్యారు.

News October 15, 2024

17న నల్గొండలో సీఎం కప్ ర్యాలీ

image

ఈనెల 17న సీఎం కప్ -2024 పేరుతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం క్రీడలు నిర్వహిస్తోందని జిల్లా యువజన, క్రీడల అధికారి విష్ణుమూర్తిగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులకు దీనిపై అవగాహన కల్పించేందుకు 17న నల్గొండలో మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News October 15, 2024

NLG: మూసీకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత

image

మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. HYD నగరంతోపాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 అడుగులు ఉంది.