News April 11, 2025
సూర్యాపేట: గుండెపోటుతో మహిళ మృతి

నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన జంపాల దేవకమ్మ(40) గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా.. దేవకమ్మ రాత్రి భోజనం చేసి పడుకున్నారు. మిరప కూలీకి వెళ్లడానికి ఇంట్లో వారు నిద్రలేపగా విగతజీవిగా ఉన్నారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. దేవకమ్మ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News September 18, 2025
HYD: 40% పెరిగిన వాహనాల సంఖ్య

6ఏళ్లలో HYD రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు 1,500 నుంచి 2 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్ రోడ్డుపై దాదాపు 8వేల టూవీలర్లు, 2 వేల కార్లు కనిపిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్పల్లి మూసాపేట సర్కిల్లోని సనత్నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.