News February 4, 2025
సూర్యాపేట: చికెన్ ముక్క కోసం పంచాయితీ

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.
Similar News
News October 21, 2025
30 ఏళ్లకు పైగా ఒకే సినిమా… అయినా తగ్గని క్రేజ్

నేడు ఏ సినిమా అయినా వారం, పది రోజులు ఆడటమే కష్టం. అలాంటిది ఓ థియేటర్లో 30 ఏళ్లకు పైగా ఒకే సినిమా వేస్తున్నారంటే ఆశ్చర్యమే. ముంబైలోని మరాఠా మందిర్లో ‘దిల్వాలే దుల్హనియే లే జాయేంగే’ రిలీజైనప్పటి నుంచి ప్రదర్శితమవుతోంది. 1995 OCT20న ఇది రిలీజైంది. ‘30సార్లు ఈ మూవీ చూశా. ఇంకా చూస్తా’ అని 60 ఏళ్ల షక్రీ అన్నారు. 1975లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘షోలే’ 5ఏళ్లు ఆడగా DDLJ దాన్ని అధిగమించింది.
News October 21, 2025
రైల్వే,ఎన్హెచ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జేసీ

విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిన రైల్వే, జాతీయ రహదారుల (ఎన్హెచ్) ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆమె సమావేశం నిర్వహించి, జిల్లా పరిధిలోని రైల్వే, ఎన్హెచ్ ప్రాజెక్టులకు సంబంధించిన స్థితిగతులపై సమీక్షించారు.
News October 21, 2025
రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.