News April 24, 2024
సూర్యాపేట: చిన్నారులకు నాయనమ్మ చిత్రహింసలు

ముగ్గురు చిన్నారులను నాయనమ్మ చిత్ర హింసలకు గురి చేసి కాల్చి వాతలు పెట్టిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి మండలం రాయినిగూడెం వద్ద ముగ్గురు పిల్లలు ఉండగా వారిని స్థానికులు గుర్తించి వివరాలు అడిగారు. నాయనమ్మ సీతమ్మ తమని కొట్టి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిందని చిన్నారులు ఆరోపించారు. వారిని పాలకీడు మండలం గూడుగుండ్ల పాలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.
Similar News
News March 5, 2026
నల్గొండ: ఈ ఆలయానిది 200 ఏళ్ల చరిత్ర

చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోనేరు వద్ద వెలిసిన లింగాన్ని చూసి రామ్‌సింగ్, పీత సింగ్ సోదరులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1895లో రాపోలు సాదుపుల్లయ్య ఇక్కడ శివరాత్రి కళ్యాణ వేడుకలు ప్రారంభించగా, నిజాం ప్రభుత్వం ఆలయానికి 28 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఏ కాలంలోనూ ఎండిపోని ‘పుట్టుగుండం’ ఇక్కడి ప్రత్యేకత.
News March 5, 2026
నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 4, 2026
NLG: మహిళలు కనిపిస్తే చాలు.. దూసుకెళ్తున్న బస్సులు!

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్‌లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


