News March 27, 2025
సూర్యాపేట: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన చివ్వెంల మండలం తుల్జారావుపేటలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి సీతారాం గేదెలను చెరువు దగ్గరికి తోలుకెళ్లాడు. వాటిని బయటకు పంపే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.
Similar News
News October 16, 2025
హద్దులు దాటుతున్న రాప్తాడు సీఐ: YCP

రాప్తాడు CI శ్రీహర్ష హద్దులు దాటుతున్నారని YCP మండిపడింది. ‘రాప్తాడులో మాజీ MLA తోపుదుర్తి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా టపాసులు కాల్చబోయిన మా కార్యకర్తలపై సీఐ జులుం ప్రదర్శించారు. ‘రండిరా టపాసులు ఎలా కాలుస్తారో నేను చూస్తా. ఒక్కొక్క నా కొ…ను బూటు కాలితో తన్నుకుంటూ వెళ్తా’ అంటూ సీఐ జులుం ప్రదర్శించారు. నువ్వు పోలీసువా.. TDP కార్యకర్తవా శ్రీహర్ష’ అని YCP ట్వీట్ చేసింది.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల అమలులో నల్గొండకు రెండో స్థానం

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం కృషిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమ్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
News October 16, 2025
పెండింగ్ ఓటర్ అప్లికేషన్లను పరిష్కరించండి: వనపర్తి కలెక్టర్

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. సీఈఓ ఆదేశాల మేరకు 100 ఏళ్లకు పైబడిన ఓటర్లలో ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి ఓట్లను తొలగించాలని సూచించారు.