News March 16, 2025
సూర్యాపేట: జిల్లాలో చికెన్ ధరలు ఇలా

సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.110-120 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News November 22, 2025
కాకినాడ: అటవీశాఖ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన

ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కాకినాడకు చెందిన విద్యార్థులు కాకినాడ జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ ఎన్. రామచంద్రరావు వారికి అటవీశాఖ కార్యక్రమాలపై, అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
News November 22, 2025
పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్: రాజీవ్ కనకాల

పౌరాణిక, జానపద పాత్రలు పోషించాలన్నదే తన అభిలాష అని సినీ నటుడు రాజీవ్ కనకాల చెప్పారు. పెదపట్నంలంకలో సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. 225 చిత్రాల్లో నటించానన్నారు. స్టూడెంట్ నెంబర్-1తో పాటు పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. విశ్వంభర, ఆంధ్రా కింగ్, చాయ్వాల, తెరచాప, మహేంద్రగిరి, వారాహి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, డ్రాగన్ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుందన్నారు.
News November 22, 2025
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.


