News March 5, 2025
సూర్యాపేట జిల్లాలో 32 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

సూర్యాపేట జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 16,948 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News March 8, 2026
అనకాపల్లి: ‘అమ్మా, నాన్న సారీ’.. సూసైడ్ నోట్‌లో విద్యార్థిని

గొలుగొండ(M) ఏఎల్ పురం జడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థిని వింజరపు దుర్గా లక్ష్మి తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అమ్మానాన్న సారీ.. తమ్ముణ్ని బాగా చూసుకోండి, నాకు స్నేహితులందరూ ఇష్టమే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని’ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా బాలిక ముభావంగా ఉన్నట్లు తోటి స్నేహితులు చెప్పినట్లు సమాచారం.
News March 8, 2026
చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్ కట్ చేస్తున్నట్లు తెలిపింది.
News March 8, 2026
KNR: జర్నలిజం కోర్సు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ అని కోర్సు సమన్వయకర్త డా.బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు SSC, INTER జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని తెలుగులో విభాగంలో సంప్రదించాలని చెప్పారు.


