News February 28, 2025

సూర్యాపేట: జిల్లాలో 94.97 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2664 ఓటర్లుండగా.. 94.97 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ‌ ప్రీత్ సింగ్ జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. టీచర్స్ ఎమెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,664 ఓట్లకు గాను 2,530 మంది జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Similar News

News October 18, 2025

బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

image

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

News October 18, 2025

రేపు రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్: కలెక్టర్

image

వాణిజ్య, వ్యాపార రంగాలకు నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ‘ది గ్రేట్ రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలో తెలిపారు. ఈ నెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆనంద్ రీజెన్సీ సమీపంలోని పందిరి ఫంక్షన్ హాల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన పెంచడం, వ్యాపారంలో ఉత్సాహం నింపడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.

News October 18, 2025

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధానా!

image

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.