News February 24, 2025

సూర్యాపేట జిల్లా టాప్ న్యూస్

image

☞  లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన స్టేట్ హౌసింగ్ ఎండీ, కలెక్టర్ ☞ సూర్యాపేటలో ఉచితంగా చికెన్, ఎగ్ మేళా ☞  మేళ్లచెరువు జాతరకు ప్రత్యేక బస్సులు ☞  చిలుకూరులో యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు ☞  తుంగతుర్తిలో సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ☞  సూర్యాపేట: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీడబ్ల్యూజేఎఫ్

Similar News

News November 28, 2025

SCలకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు జీవో

image

AP: SC ఉద్యోగులకు ప్రమోషన్లలో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉపకులాలకూ న్యాయం చేయడానికి 3గ్రూపులుగా విభజించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం గ్రూప్-1 కింద రెల్లి కులాలకు 1%, గ్రూప్-2లో మాదిగ ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తింపజేయనుంది. కేడర్ స్ట్రెంత్ 5 కంటే ఎక్కవ ఉన్నచోట ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రతి గ్రూపులో మహిళలకు 33.33% సమాంతర రిజర్వేషన్ ఉంటుంది.

News November 28, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 28, 2025

2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు!

image

TG: రాష్ట్రంలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు RTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.