News January 30, 2025
సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు

సీపీఎం రాష్ట్ర కమిటీలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహాసభలో మల్లు లక్ష్మి మూడోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మల్లు నాగార్జున్ రెడ్డి మూడో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావులను ఎన్నుకున్నారు.
Similar News
News December 17, 2025
SRH మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ ఫైర్

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.
News December 17, 2025
KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 17, 2025
శ్రీరాంపూర్: సింగరేణి ఇన్చార్జి సీఅండ్ఎండీగా కృష్ణ భాస్కర్

సింగరేణి సంస్థ ఇన్చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఅండ్ఎండీ)గా కృష్ణ భాస్కర్ నియమితులైనట్లు సమాచారం. 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఅండ్ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి సీఅండ్ఎండీగా ఆయనను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.


