News March 17, 2025
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బాధితులు తమ సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News December 31, 2025
2025: ESPN వన్డే, టీ20, టెస్ట్ టీమ్స్ ఇవే

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో టెస్ట్, వన్డే, టీ20 టీమ్స్ను ESPNCRICINFO ప్రకటించింది. టెస్టుల్లో భారత్ నుంచి రాహుల్, గిల్, జడేజా, సిరాజ్, వన్డేల్లో రోహిత్, కోహ్లీ, టీ20ల్లో అభిషేక్, వరుణ్, బుమ్రాను ఎంపిక చేసింది. వన్డేలకు రోహిత్, టెస్టులకు బవుమా, టీ20లకు పూరన్కు కెప్టెన్గా సెలక్ట్ చేసింది. అటు వన్డే, T20ల్లో మహిళా టీమ్స్నూ ప్రకటించింది. పూర్తి టీమ్స్ కోసం పైన స్వైప్ చేయండి.
News December 31, 2025
విశాఖలో మూడు స్టాండింగ్ కమిటీల పర్యటన

విశాఖలో రైల్వే, వాణిజ్య, రక్షణ శాఖలకు చెందిన 3 పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు జనవరిలో పర్యటించనున్నాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కమిటీల పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News December 31, 2025
నూతన సంవత్సరం COME WITH BOOK: కలెక్టర్

జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజార్షిషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలవడానికి వచ్చే సందర్శకులకు జిల్లా యంత్రాంగం తరఫున ఒక వినూత్నమైన, సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. COME WITH BOOK అనే నినాదంతో, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలన్నారు.


