News March 12, 2025

సూర్యాపేట జిల్లా వాసుల ఆశలు నెరవేరేనా..?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించి తమ ఆశలు నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట ఆటోనగర్‌లో ఐటీ కారిడార్ ఏర్పాటు, ఎస్సారెస్పీ కాల్వలకు నిధులు కేటాయించాలంటున్నారు. తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 28, 2025

అనకాపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

image

యుపీఎస్సీ సివిల్స్‌కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకు సిద్ధం అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు 2 ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ జత చేయాలన్నారు.

News November 28, 2025

ఖమ్మం: వరి కొయ్యలను కాల్చొద్దు.. కలియ దున్నాలి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దానికి బదులుగా, వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. దీని వల్ల మట్టిలో పోషకాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని అధికారులు రైతులకు వివరించారు.

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.