News February 27, 2025

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్

image

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది మంది ఓటర్లకు గాను 2,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,702 మందికి గాను 1,619, మహిళలు 962 మందికి గాను 911 మంది ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్ నమోదయింది.

Similar News

News February 28, 2025

సిద్దిపేట: 2019లో 59.03%.. 2025లో 70.42%

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.

News February 28, 2025

భువనగిరి: జిల్లాలో 96.54 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 984 ఓటర్లుండగా.. 96.54 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

News February 28, 2025

బాపట్ల: మైనర్ బాలికపై అత్యాచారం

image

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

error: Content is protected !!