News March 4, 2025

సూర్యాపేట: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్..

image

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలు సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉన్నారు.

Similar News

News November 16, 2025

చూద్దాం పదండి.. హైదరాబాద్ అందాలు

image

భాగ్యనగరం అంటే చార్మినార్‌, గోల్కొండ మాత్రమే కాదు. చరిత్ర సుగంధం వెదజల్లే అనేక అపూర్వ కట్టడాలకు ఆవాసమిది. సంస్కృతి, కళ, నిర్మాణ కౌశలాల సమ్మేళనం. శతాబ్దాల నాటి వారసత్వ సంపద నగరంలో ముత్యాల్లా మెరిసిపోతున్నాయి. వాటి వెనుక కథలను వెలికితీసే ప్రయత్నమే ఇది. రోజూ ఓ చారిత్రక కట్టడం, ప్రముఖుల విశేషాలతో ‘హైదరాబాద్‌ అందాలు’ రానుంది. వారాంతాల్లో ఈ అందాలపై ఓ లుక్ వేయండి.<<18301143>> ఫలక్‌నుమా<<>>ప్యాలెస్ గురించి తెలుసుకుందాం.

News November 16, 2025

మంచిర్యాల: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

image

MNCL(D) దండేపల్లి(M) వెంకటరావుపేటకు చెందిన మల్లేషం-పోషవ్వ దంపతుల కూతురు దివ్యాంగురాలైన అర్చన(15) KNR జిల్లా వావిలాలపల్లిలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చే సరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.

News November 16, 2025

ప్రజా జీవితంలోకి రాబోతున్నా: ఆశ కిరణ్

image

వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. నేడు ఆశ కిరణ్ విజయవాడలో తన తండ్రి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నా అని ఆమె అన్నారు. రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని చెప్పారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.