News February 14, 2025
సూర్యాపేట: టీచర్ ఎమ్మెల్సీ పోటీలో నిలిచింది వీరే..

WGL-KMM-NLG టీచర్ MLC బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. వారిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్ష వర్ధన్‌రెడ్డి, సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి, ఏలె చంద్రమోహన్, చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, పురుషోత్తం రెడ్డి, వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు ఉన్నారు.
Similar News
News November 5, 2025
సిరిసిల్ల: ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో స్పెషల్ లోక్ అదాలత్‌పై ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు.
News November 5, 2025
NLG: ఎట్టకేలకు రేషన్ సంచుల పంపిణీ!

రేషన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేషన్ సంచులు పంపిణీ చేయనున్నారు. గత నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచులను ఐఎంజీ గోదాములకు సరఫరా చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో సంచులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఎంజీ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా రేషన్ షాపులకు సంచులు చేరాయి.
News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.


