News August 1, 2024
సూర్యాపేట: టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం!

సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్డుప్రమాదాలు, వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫ్లై ఓవర్ను నిర్మించాలని ఆర్అండ్బీ, వ్యవసాయ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు NHAI అధికారులను బుధవారం కోరడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే వాెహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి.
Similar News
News October 30, 2025
NLG: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, R&B, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు.
News October 30, 2025
NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.
News October 30, 2025
NLG: మోంథా ఎఫెక్ట్… రైళ్ల రద్దు

మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి NLG మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. ఇవాళ ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.


