News September 14, 2024
సూర్యాపేట: ‘ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారు’
సూర్యాపేట జిల్లా యాతవకిళ్లలో ఆకతాయిలు అర్ధరాత్రి ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారి వివరాలిలా.. ఓ వర్గానికి చెందిన వినాయకుడి వద్ద భజన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు పూజా కార్యక్రమాలను చేయకుండా మరో వర్గం వారు అడ్డుకుంటున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News October 5, 2024
రైతుబంధులో అవకతవకలు జరిగాయి: మంత్రి పొంగులేటి
రైతుబంధులో అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తిరుమలగిరి మం. నెల్లికల్‌లో భూసమస్యల పరిష్కారం కోసం రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్టిఫికెట్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
News October 5, 2024
NLG: బీఈడీ ఫలితాలు విడుదల
MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News October 5, 2024
యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త
మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.