News March 4, 2025

సూర్యాపేట: తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ

image

సూర్యాపేట మండలం భాషా నాయక్ తండాలో అదివారం అర్ధరాత్రి దొంగలు రెండిళ్లలో చోరీకి పాల్పడి బంగారం అపహరించుకుపోయారు. ఎస్సై బాలు నాయక్ వివరాలిలా.. భాష నాయక్ తండాకు చెందిన సంకెల్లంబట్ల రామకుమార్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తాళం పగులగొట్టి దుండగులు 17 గ్రాముల పుస్తెలతాడును అపహరించారు. అలాగే శ్రీనివాస్ ఇంట్లో 17 గ్రాముల బ్రాస్లెట్, ఒక ఉంగరం అపహరించారు. కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News October 26, 2025

సిరిసిల్ల: పాము కాటుతో 18 నెలల చిన్నారి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన ఏడాదిన్నర చిన్నారి చేకుట వేదాన్షి శనివారం రాత్రి పాము కాటుతో మృతి చెందింది. ఆశిరెడ్డిపల్లికి చెందిన రమేష్-సుమలతల కూతురు వేదాన్షి ఇంటిముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలపడంతో బాధిత తల్లిదండ్రులు బోరున విలపించారు. వేదాన్షి మృతితో ఆశిరెడ్డిపల్లిలో విషాదం అలుముకుంది.

News October 26, 2025

RTC, ప్రైవేట్ బస్సులకు తేడా ఏంటి?

image

ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు ఉంటారు. డ్యూటీకి ముందు ప్రతి డిపోలో ఆల్కహాల్ టెస్టు చేస్తారు కాబట్టి మద్యం తాగి బస్సు నడిపే అవకాశం ఉండదు. బస్సుకు స్పీడ్ లాక్ ఉండటంతో గంటకు 80 కి.మీ. వేగాన్ని దాటి వెళ్లలేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రాత్రి వేళ్లలో గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగే అవకాశమూ ఉంది.

News October 26, 2025

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.