News March 20, 2025

సూర్యాపేట: త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లు

image

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 4,140 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు మేలు జరగనుంది. జిల్లాలో ఈ పథకానికి 3,09,062మంది దరఖాస్తు చేసుకున్నారు.

Similar News

News March 28, 2025

అమరచింత, ఆత్మకూరు అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు

image

వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణాలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో ఆత్మకూరుకు చెందిన సామాజిక కార్యకర్త బసిరెడ్డి సంతోష్ రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పూజారి శ్రీలేఖ, అక్రమ నిర్మాణం, నాలాల ఆక్రమణ, అధికారుల నిర్లక్ష్యాన్ని సవాలు చేస్తూ వాదన కొనసాగింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సురాయిపల్లి, రేణుక ఎరా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

News March 28, 2025

వనపర్తి: వాటిని మహిళా సంఘాలకు కేటాయించండి: కలెక్టర్

image

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా మహిళా సంఘాలకు కేటాయించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈవోల ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఈ శిక్షణలో వారు తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూడాలని సూచించారు.

News March 28, 2025

ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

image

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్‌లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!