News March 26, 2025

సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

image

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.

Similar News

News October 24, 2025

దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

image

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News October 24, 2025

HYD: CM సార్.. జర మా వైపు చూడండి!

image

పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ జీవి రోడ్డెక్కాల్సిందే. చలి, వాన, ఎండ ఎరుగరు. ఏం చేస్తా మరి.. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు. బల్దియా కార్మికుల బాధ ఇది. ‘లక్షలు జీతాలు తీసుకునే వారికే పండుగ బోనస్‌లు.. మా వైపు ఎవరు చూస్తారు సార్’ అంటూ ఓ కార్మికుడు Way2Newsతో వాపోయాడు. వాస్తవానికి సిటీని క్లీన్ చేయడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలకం. CM చొరవ చూపితే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు వేడుకుంటున్నారు.

News October 24, 2025

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు ఉన్నారు.