News May 11, 2024
సూర్యాపేట: నకిలీ బంగారంతో రూ.56 లక్షలు రుణం

నకిలీ బంగారంతో ఓ వ్యక్తి బ్యాంకును బురిడీ కొట్టించాడు. బ్యాంకు అధికారుల వివరాలిలా.. నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామానికి చెందిన రాజేశ్ 2023 మేలో గరిడేపల్లి మండలంలో రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ.56 లక్షల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో ఉన్నతాధికారులు ఆడిట్ చేశారు. ఆ బంగారం నకిలీదని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
NLG: జిల్లాలో 5.1 సగటు వర్షపాతం

అల్పపీడన ద్రోణి కారణంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో 5.1 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా కొండమల్లేపల్లి మండలంలో 26.5 మీల్లీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లిలో 11.6, మర్రిగూడలో 3.7, మునుగోడులో 10.6, గుడిపల్లిలో 12.5, పీఏ పల్లిలో 19.3, గుర్రంపోడులో 21.1, చిట్యాలలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News October 26, 2025
పత్తిని ఇక్కడ అమ్ముకుంటేనే లాభం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, రైతులు దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,68,778 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని.. జిల్లావ్యాప్తంగా 57,23,951 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని ఆయన తెలిపారు.
News October 26, 2025
NLG: పాపం పత్తి రైతు.. ఇలాగైతే కష్టమే!

వరుస వర్షాలతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. అకాల వర్షాల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 12 శాతం లోపు తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర వచ్చే నిబంధనలు ఉండడం రైతుకు ఇబ్బందిగా మారింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం తగ్గడం లేదని రైతుల వాపోతున్నారు.


