News April 5, 2024
సూర్యాపేట: ‘నిర్లక్ష్యమే ముగ్గురి ప్రాణాలు తీసింది ‘

సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<12991416>>ముగ్గురు మృతిచెందగా,<<>> 14మందికి గాయాలైన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పెద్ద శబ్దంతో సినిమా పాటలు పెట్టి నిర్లక్ష్యంగా ఆటో నడపడం కూడా ప్రమాదానికి ఓ కారణమని బాధితుల బంధువులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.
Similar News
News October 16, 2025
నల్గొండ: భారీగా తగ్గిన దరఖాస్తులు

గతేడాదితో పోల్చుకుంటే మద్యం టెండర్లకు దరఖాస్తులు భారీగా తగ్గే అవకాశముంది. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం 496 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఈ సంఖ్య 7,057గా ఉంది. దరఖాస్తు చేయడానికి రెండు రోజులే అవకాశం ఉంది. డిపాజిట్ ధర పెంచడం కూడా దరఖాస్తులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
News October 15, 2025
పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.