News February 3, 2025

సూర్యాపేట: నీటి తొట్టలో పడి చిన్నారి మృతి

image

పాలకవీడు మండలం హనుమయ్య గూడెంలో ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు కృష్ణ, శిరీష దంపతులకు ఏడాదిన్నర పాప నవనీత ఉంది. కృష్ణ సీఆర్పీఎఫ్ జవాన్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వారం క్రితం తల్లి శిరీష, కుమార్తె స్వగ్రామానికి వచ్చారు. తల్లి ఇంటి పనులు చేస్తుండగా పాప ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందింది.

Similar News

News February 17, 2026

వరంగల్ జిల్లాలో నూతన సర్పంచులకు శిక్షణ

image

గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామంలో వరంగల్ జిల్లాలోని 11 మండలాలకు చెందిన నూతన సర్పంచుల కోసం నాలుగు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాలకు నిజమైన అభివృద్ధి తీసుకురావాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం-2018పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.

News February 17, 2026

పెద్దపల్లి: వృద్ధురాలి హత్య.. నిందితుడికి ‘జీవిత ఖైదు’.!

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన సంపత్ రావుకు వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత మంగళవారం తీర్పునిచ్చారు. 2019లో చంద్రమ్మ అనే వృద్ధురాలిని పీటతో కొట్టి చంపి, ఆమె బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను రామగుండం సీపీ అభినందించారు.

News February 17, 2026

VZM: ‘గ‌నుల లీజుకు త్వ‌ర‌గా అనుమ‌తులు’

image

నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలించిన అనంత‌రం గ‌నుల లీజుకు వీలైనంత త్వ‌ర‌గా అనుమ‌తులు జారీ చేస్తామ‌ని JC సేధు మాధ‌వ‌న్ చెప్పారు. స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ ఆద్వ‌ర్యంలో వీసీ నిర్వ‌హించారు. గ‌రివిడి మండ‌లం మందిర‌వ‌ల‌స‌, చీపురుప‌ల్లి మండలం నిమ్మ‌ల‌వ‌ల‌స‌, నెల్లిమ‌ర్ల మండ‌లం జ‌గ్గిరాజుపేట గ‌నుల కోసం వివరించి NOC మంజూరు చేస్తామ‌ని తెలిపారు.