News April 12, 2025

సూర్యాపేట: నీటి సంపులో పడి బాలుడి మృతి

image

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మోతె మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన శివ, స్వరూప దంపతులకు చెందిన మూడేళ్ల బాలుడు భువనేశ్వర్ చౌహన్ శుక్రవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందాడు. ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై బాలుడిని గమనించలేదు. ఈక్రమంలో విషాద ఘటన జరగింది. బాలుడి మృతితో తండాలో విషాదం అలుముకుంది.

Similar News

News October 28, 2025

MCEMEలో 49 ఉద్యోగాలు

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 28, 2025

వరంగల్: బాలికపై బాలుడు అత్యాచారం

image

బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ తండాలో జరిగింది. ఉపాధి నిమిత్తం బాలిక తల్లి HYDకి వెళ్లడంతో అమ్మమ్మ వద్ద బాలిక ఉంటోంది. రోజూ మాదిరిగానే బాలిక అంగ్వాడీకి వెళ్లిన క్రమంలో అంగన్వాడీ టీచర్ కొడుకు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. బాలిక దుస్తులపై రక్తం మరకలు, గాయాలు చూసి పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

News October 28, 2025

పల్నాడు: రేపు విద్యా సంస్థలకు సెలవు

image

తుఫాను కారణంగా పల్నాడు జిల్లాలో 29వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కలెక్టర్ కృతికా శుక్లా కీలక ప్రకటన చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.