News April 6, 2025

సూర్యాపేట: నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్

image

సూర్యాపేట జిల్లా పరిధిలో నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగులు, ర్యాలీలు, ఊరేగింపులను నిర్వహించొద్దని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని తెలిపారు. జిల్లాలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు.

Similar News

News October 26, 2025

GNT: ‘మొంథా’ తుఫాన్.. స్కూల్ హాలిడేస్‌పై గందరగోళం

image

‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రైవేట్ స్కూల్స్ నుంచి సమాచారం రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సెలవు కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా లేక ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందా అనే అయోమయంలో పడ్డారు.

News October 26, 2025

ప్రకాశం: తుఫాన్.. 3 రోజులు స్కూల్స్‌కు సెలవులు!

image

ప్రకాశం జిల్లాకు ముంథా తుఫాన్ కారణంగా 27, 28, 29 తేదీల్లో 3 రోజులపాటు అన్ని పాఠశాలలకు కలెక్టర్ రాజాబాబు సెలవులు ప్రకటించారు. తుఫాన్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

ప్రకాశం: విద్యార్థులకే సెలవు.. టీచర్లు బడికి రావాల్సిందే!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపటినుంచి 3 రోజులపాటు పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఒంగోలులో DEO కిరణ్ కుమార్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. కానీ <<18111249>>టీచర్లు<<>> విపత్కర పరిస్థితుల్లో సాయం అందించేందుకు విధులకు హాజరుకావాలన్నారు.