News March 21, 2025

సూర్యాపేట: పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు: ఎస్పీ

image

నేటి నుంచి వచ్చేనెల 4 వరకు జరగనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బందికి సూచనలు చేశారు. పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, క్యాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి నిషిద్ధం అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.

Similar News

News November 24, 2025

UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>UCIL<<>>)107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ కాంపిటెన్సీ, మైనింగ్ మేట్, ఫోర్‌మెన్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ucil.gov.in/

News November 24, 2025

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

News November 24, 2025

ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

image

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.