News March 11, 2025

సూర్యాపేట: ‘పరువు హత్యలు ఇకనైనా ఆగాలి!’

image

2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రణయ్ హత్య తర్వాత జరగిన పరువు హత్యలు చర్చకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని భువనగిరిలో రామకృష్ణను, ఇటీవలే సూర్యాపేటలో మాల బంటిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 26, 2025

సర్పంచ్ ఎన్నికల కోసం మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే సర్పంచ్ ఎన్నికల కోసం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మీడియా కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌ఓ తిరుమల పాల్గొన్నారు.

News November 26, 2025

పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.

News November 26, 2025

గద్వాల: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమావళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంపీడీవోలకు తహశీల్దారులు సహకరించాలని సూచించారు. అవసరం మేరకు జీపీఓల సేవలను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలన్నారు.