News April 6, 2024
సూర్యాపేట: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News January 16, 2025
నల్గొండ: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతరలు, ఉర్సుల సీజన్ మొదలు కానుంది. జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ జాతరకు 30 నుంచి 50లక్షల వరకు భక్తులు హాజరవుతారని అంచనా. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు, మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.
News January 16, 2025
నల్గొండ: చివరి దశకు చేరుకున్న వరి నాట్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉంది. సాగర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో గతంతో పోల్చితే ఎక్కువగానే సాగయినట్లు రైతులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలో కొన్ని చోట్ల బోర్ల పోయకపోవడంతో కొందరు రైతులు భూములను పడావు పెడుతున్నారు.
News January 15, 2025
NLG: ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యం
విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న, ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు తప్పనిసరిగా ఆంగ్ల ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని DIEO దస్రూ నాయక్ తెలిపారు.