News March 19, 2025

సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

image

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్‌లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News December 7, 2025

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ, అలాగే మరికొందరికి స్థానచలనం కల్పిస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పటమట ఎస్ఐ కృష్ణ వర్మ, తిరువూరు ఎస్ఐ సత్యనారాయణను 5వ ట్రాఫిక్‌కు భవానీపురంలో ఉన్న ఆనంద్ కుమార్‌ను సైబర్ క్రైమ్‌కు సుమన్‌ను పీసీఆర్‌కు కొత్తపేటలో ఉన్న రాజనరేంద్రను గుణదల పోలీస్ స్టేషన్‌కు నందిగామలో ఉన్న శాతకర్ణిను తిరువూరుకు బదిలీ చేశారు.

News December 7, 2025

నిజామాబాద్: DCCలకు పరీక్ష

image

కొత్తగా ఎన్నికైన ఉమ్మడి NZB జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.

News December 7, 2025

వెంకటాపూర్: జడ్పీటీసీ నుంచి సర్పంచ్‌గా పోటీ

image

వెంకటాపూర్ మండలం నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా తాజా మాజీ జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్ బరిలో నిలిచారు. గతంలో నర్సాపూర్ సర్పంచ్‌గా పని చేసిన ఆమె, అనంతరం జడ్పీటీసీగా గెలుపొందారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తిరిగి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు రుద్రమదేవి తెలిపారు.