News April 16, 2025

సూర్యాపేట: ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 17నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

Similar News

News April 25, 2025

IPL: RR ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!

image

రాజస్థాన్ రాయల్స్‌కు ప్లేఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయాయి. 9 మ్యాచ్‌లలో 7 ఓటములతో ఆ జట్టుకు రన్ రేటు -0.625 ఉంది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే మిగతా 5 మ్యాచ్‌లను అతి భారీ తేడాలతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్‌లు మినహా మరే జట్టు 14 పాయింట్లను దాటకూడదు. అలాగే ఇతర జట్ల కంటే బెటర్ నెట్‌రన్ రేటు ఉండాలి. GT, DC, RCB, MI, PBKS అదరగొడుతున్నందున ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RR ప్లేఆఫ్స్ వెళ్లలేదు.

News April 25, 2025

కామారెడ్డి: మహిళను కాపాడిన కానిస్టేబుల్

image

కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ దేవా కుమార్‌ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించి ఓ మహిళను చాకచక్యంగా రక్షించినందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.హనుమంతరావు ప్రశంసించి శాలువాతో సత్కరించారు. సమయస్ఫూర్తితో 100కి సమాచారం ఇచ్చి ఆమెను కాపాడిన దేవా కుమార్‌కు అభినందనలు తెలిపారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. విధి నిర్వహణతో పాటు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కొనియాడారు.

News April 25, 2025

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్ 

image

సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో స్థానిక రెడ్డీస్ కాలనీకి చెందిన వైసీపీ నేత, రైస్ మిల్ మాధవరెడ్డిని గురువారం రాత్రి తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. CID DSP కొండయ్య నాయుడు కథనం ప్రకారం.. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. గురువారం మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

error: Content is protected !!