News April 4, 2024
సూర్యాపేట ప్రమాదం మృతుల వివరాలు

సూర్యాపేట ప్రమాద ఘటనలో బాధితుల వివరాలు  ఇలా ఉన్నాయి. చింతరెడ్డి సరిత టీచర్(44),
లునావత్ రుక్కమ్మ(63), గొలుసు వేదస్విని(17నెలలు) మృతిచెందారు. కలకొట్ల లావణ్య, కంపసాటి  మహేష్(ఆటో డ్రైవర్), శివరాత్రి హైమావతి, రాములమ్మ, బొప్పాని పావని, మంగయ్య(టీచర్), చెరుకుపల్లి  సైదమ్మ, చెరుకుపల్లి శైలజ, చెరుకుపల్లి  విజయేందర్, జీడిమెట్ల సైదులు, కొమ్ము సువర్ణ, గొలుసు సంధ్య, గొలుసు మోక్షిత్, సైదులు గాయపడ్డారు.  
Similar News
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
News October 31, 2025
NLG: రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

బకాయిల వసూళ్ల విషయంలో నల్గొండ మున్సిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో ఈ ఏడాది ఆస్తి పన్ను రూ.9.30 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇకపోతే పాత బకాయిలు రూ. 33.80 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.43.11 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.
News October 31, 2025
NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.


