News March 14, 2025
సూర్యాపేట: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

సూర్యాపేటలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI
Similar News
News March 24, 2025
సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ వార్

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నాయి. మరి మీ కామెంట్..
News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
News March 24, 2025
SLBCలో ఆ ఏడుగురి ఆచూకీ లభించేనా..?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ SLBC సొరంగం కూలి 8 మంది గల్లంతైన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న ఒకరి మృతదేహం లభించగా మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ ఘటన జరిగి నేటికి 31 రోజులు గడిచినా సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి మృతదేహాలు లభించేనా అని అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఆ ఏడుగురి ఆచూకీ మాత్రం దొరకడం లేదు.