News January 29, 2025

సూర్యాపేట: బావమరుదులే చంపారు!

image

సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన <<15277486>>పరువు హత్య<<>> కేసులో బావమరుదలే బావను చంపారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తమ సోదరి కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని భావించిన ఆమె సోదరులు ప్లాన్ ప్రకారం కృష్ణను హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు మృతదేహాన్ని కారులో వేసుకొని 100 కిమీ వెళ్లారని, మళ్లీ తీసుకొచ్చి తన చెల్లి ఇంటి సమీపంలో వేసి లొంగిపోయారన్నారు. 

Similar News

News December 6, 2025

భద్రాద్రి జోన్ పరిధిలో 22 మందికి ఏఎస్సైలుగా పదోన్నతులు

image

భద్రాద్రి జోన్ పరిధిలోని 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్‌ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి పొందిన వారిని జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News December 6, 2025

ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

తూ.గో.: 76 శాతం ‘ఖరీఫ్‌’ కోతలు పూర్తి

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 76.42 శాతం కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎస్. మాధవరావు తెలిపారు. మొత్తం 81,406 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 62,217 హెక్టార్లలో పంట కోతలు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.