News February 13, 2026
సూర్యాపేట: బ్యాలెట్ బాక్సులో పెన్షనర్ ఆవేదన

సూర్యాపేట 35వ వార్డు ఉప ఎన్నికల లెక్కింపులో ఓ విశ్రాంత ఉద్యోగి రాసిన లేఖ కలకలం రేపింది. “రిటైరై 15 నెలలైనా బకాయిలు అందలేదు. వైద్యం అందక ఇప్పటికే 62 మంది సహచరులు మరణించారు. మేము బతికుండగానే మా పైసలు మాకు ఇవ్వండి” అంటూ ప్రభుత్వానికి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఓట్ల పెట్టెలో ప్రత్యక్షమైన ఈ లేఖ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News March 16, 2026
NZB: ఫీజులు లక్షల్లో.. భోజనం నరకప్రాయం

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ అందించకుండా, ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం తిండితో అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.


