News February 15, 2025
సూర్యాపేట: మరోసారి కులగణన..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్‌లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్‌లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.
Similar News
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు!

తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తాము బలపరుస్తున్న అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులకు చర్చలు మొదలు పెట్టాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ అభ్యర్థులు మద్దతునిస్తుండగా మరికొన్ని గ్రామాల్లో BRS, BJP,CPM,CPIలు సహకరించుకుంటున్నాయి. కాంగ్రెస్, CPI, CPM కూడా వివిధ గ్రామాల్లో ఆయా పార్టీల ప్రాబల్యాన్ని బట్టి ఒక అవగాహనతో ముందుకెళ్తున్నాయి.
News December 5, 2025
NGKL: జిల్లాలో స్వల్పంగా పెరిగిన చలి

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలితీవ్రత స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలో చారకొండ మండలంలో17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ మండలంలో 18.4, పదర మండలంలో 19.6, కల్వకుర్తి మండలంలో 19.8, బల్మూరు మండలంలో19.9, ఊర్కొండ మండలంలో 19.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
News December 5, 2025
పల్నాడు: 28 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

పల్నాడు జిల్లాలో 28 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ కలెక్టర్ కృత్తికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలకు గ్రేడులు కేటాయించి పోస్టింగ్‌లు కల్పించినట్లు నియామకపు ఉత్తర్వులలో తెలిపారు. ఎడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, వినుకొండ, దాచేపల్లి, తదితర మండలాలకు కేటాయించారు.


