News February 8, 2025
సూర్యాపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
Similar News
News October 26, 2025
సిద్దిపేట: ఆమె ఓపికకు సలాం..!

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సిద్దిపేటలో పర్యటించిన సందర్భంగా వెంకటేశ్వర ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ డ్యూటీలో గర్భిణీ అయిన ఓ మహిళా కానిస్టేబుల్ రెండు, మూడు గంటల పాటు నిలబడాల్సి వచ్చింది. ఆమె ఓపికను కొందరు అభినందించగా, ఇబ్బందికర పరిస్థితుల్లో అలాంటి డ్యూటీ వేయడంపై మరికొందరు విమర్శించారు.
News October 26, 2025
ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు బాబోయ్!

కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులంటేనే వణికిపోతున్నారు. ఆలస్యమైనా ఫర్వాలేదు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య సుమారు 250 కి.మీ దూరం ఉంటే ప్రైవేట్ బస్సులు 3 గంటల్లోనే వెళ్తాయి. దీన్ని బట్టి అవి ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ స్పీడ్లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
News October 26, 2025
చిత్తూరు: వైద్య సిబ్బందికి సెలవులు లేవు

భారీ వర్ష సూచనల నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు లేవని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. ఆదివారం జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే సోమ, మంగళ వారాల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.


