News October 26, 2024
సూర్యాపేట మీదుగా సెమీ స్పీడ్ కారిడార్

శంషాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు సూర్యాపేట మెయిన్ జంక్షన్ ద్వారా సెమీ హై స్పీడ్ కారిడార్ ఖరారైంది. అలాగే ఇంకో మార్గం కర్నూలు నుంచి విశాఖపట్టణం వరకు సూర్యాపేట మెయిన్ జంక్షన్ గా ఖరారైంది. నవంబర్లో దీనికి సంబంధించిన ఎలైన్మెంట్ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. గంటకు 220 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే సెమీ హై స్పీడ్ కారిడార్గా గుర్తింపు పొందనుంది. దీంతో సూర్యాపేట పట్టణం రూపు రేఖలు మారనున్నాయి.
Similar News
News October 30, 2025
NLG: ధాన్యం తడవడంతో సెంటర్ ఇన్ఛార్జికి షోకాజ్

తిప్పర్తి మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.
News October 30, 2025
కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.
News October 30, 2025
తుఫాను.. అధికారులకు సెలవులు రద్దు: నల్గొండ కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి సిబ్బంది అనుమతి లేకుండా సెలవుపై వెళ్లవద్దని, విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


