News February 16, 2026
సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా నివేదిత

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ షఫీ ఉల్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నూతన పాలకవర్గం ప్రకటించింది.
Similar News
News March 17, 2026
IPL తొలి మ్యాచులకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం!

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్‌వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్‌గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.
News March 17, 2026
జానకంపల్లి విద్యార్థికి నవోదయలో జిల్లా మొదటి ర్యాంకు

జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిషిత్ చంద్ర 97.5 మార్కులు సాధించి కామారెడ్డి జిల్లాలో ప్రథమ ర్యాంకు సాధించారని మండల విద్యాధికారి రాజులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయి ర్యాంకు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు వసంతను అభినందించారు.
News March 17, 2026
డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం: కలెక్టర్

ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు(AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.


