News February 3, 2025
సూర్యాపేట: మూడున్నర కిలోల మొరంగడ్డ

సాధారణంగా ఒక మొరంగడ్డ 200, 300 గ్రాములుంటుంది. కానీ చిలుకూరులో మాత్రం ఓ రైతు చేనులో కాసిన మొరంగడ్డ ఏకంగా మూడున్నర కిలోలు ఉంది. గ్రామానికి చెందిన అలసకాని వెంకటయ్య పొలంలో బావిగడ్డకు సెప్టెంబర్‌లో మొరంగడ్డ తీగను నాటాడు. నాలుగు నెలల తర్వాత బావి గడ్డను తవ్వగా మూడున్నర కిలోల మొరంగడ్డ వచ్చిందని చెప్పారు. దానిని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్స్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)-చెన్నై ఎగ్మోర్(MS) (నం.07146,47) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 6.40 గంటలకు SCలో బయలుదేరే ఈ ట్రైన్ 7న అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 8 గంటలకు MS చేరుకుంటుందన్నారు, 7న మధ్యాహ్నం 12.30కి MSలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ, 8న తెల్లవారుజామున 3కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
News December 6, 2025
PDPL: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి: సీపీ

రామగుండం CP అంబర్ కిషోర్ ఝా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి సర్వేలియన్స్ చెక్‌పోస్ట్‌ను సందర్శించి వాహన తనిఖీలు పరిశీలించారు. ఓటర్లను ప్రలోభపెట్టే నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం గర్రెపల్లి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, పటిష్ఠ భద్రత, 24/7 పర్యవేక్షణ అమలు చేయాలని సూచించారు.
News December 6, 2025
సంగారెడ్డి: డీడీఓపీగా శైలజ నియామకం

ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ న్యాయవాది శైలజ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. తన నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విధులను అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు. నూతన డీడీఓపీను పలువురు న్యాయవాదులు అభినందించారు.


